News April 1, 2025
ఏలూరు: పండుగ రోజుల్లో భారీగా చికెన్ అమ్మకాలు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో పలు చోట్ల కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. మరి మీ ప్రాంతంలో ధర ఎంతో కామెంట్ చేయండి.
Similar News
News April 22, 2025
అనంత జిల్లాలో చలివేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో నియోజకవర్గ వారిగా డెవలప్మెంట్ ప్లాన్‌ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో చలివేంద్రాలను అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత ఆర్ఓ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు.
News April 22, 2025
పదేళ్ల పిల్లలకూ సొంతంగా బ్యాంక్ లావాదేవీలకు అనుమతి

ప్రస్తుతం మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ఎవరైనా గార్డియన్‌గా ఉండటం తప్పనిసరి. ఇకపై పదేళ్లు దాటిన పిల్లలు కూడా ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేలా RBI మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను తెరిచి లావాదేవీలను సాగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, చెక్ బుక్ సదుపాయమూ ఉంటుంది. జులై 1 నుంచి ఈ రూల్స్‌ను అమలు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది.
News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.