News March 20, 2024
ఏలూరు: పట్టాలపై డెడ్‌బాడీ.. ‘అమ్మ’ పచ్చబొట్టు
ఏలూరు రైల్వే స్టేషన్ పరిధి తేలప్రోలు రైల్వే స్టేషన్ గేటు సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆది నారాయణ ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుడి చేయిపై ‘అమ్మ’ అని పచ్చ బొట్టు ఉందన్నారు. రైలు ప్రమాదంలో మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 21, 2024
ఏలూరు: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ జారీ
ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి శుక్రవారం ఏలూరు డీఎస్పీ శ్రావణ కుమార్‌ను ఆశ్రయించింది. తాను చనిపోయినట్లు చూపించి 70 సెంట్లు భూమిని భలే హానొక్ పేరుపై మార్చారని ఆరోపించింది. రాణి చనిపోయినట్టుగా 2012లో డెత్ సర్టిఫికెట్‌పై సాక్షి సంతకాలు పెట్టిన ఘంటసాల నాగార్జున, సైదు వీరయ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News September 21, 2024
ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
రైల్వే లైన్ల పునరుద్ధరణ పనుల కారణంగా ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29న తిరుపతి- విశాఖపట్నం, 30న విశాఖపట్నం- తిరుపతి, విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, రాజమహేంద్రవరం – విశాఖపట్నం, అలాగే అక్టోబర్ 1న విశాఖపట్నం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
News September 20, 2024
ఏలూరు: సులభంగా ఇసుక బుక్ చేసుకోండి ఇలా..
ఏలూరు జిల్లాలో ఇవాళ్టి నుంచి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ద్వారా ఇసుక సరఫరా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ప్రభుత్వ వెబ్ సైట్ www.sand.ap.gov.in ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1800 425 6025, 08812-234014 సంప్రదించాలని ఆమె వెల్లడించారు.