News February 9, 2025

ఏలూరు పర్యటనలో మంత్రి కందుల

image

ఏలూరు పర్యటనకు తొలిసారిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయనకు పూల బొకే ఇచ్చి శాలువతో సత్కరించారు. అనంతరం అక్కడ నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు.

Similar News

News December 3, 2025

ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

News December 3, 2025

124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<>BSE<<>>) 124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ/ఎంఈడీ, నెట్/SLAT, పీహెచ్‌డీ, ఎంబీఏ, సీఏ, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష(టైర్1, టైర్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cbse.gov.in

News December 3, 2025

చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

image

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.