News February 17, 2025

ఏలూరు: పీసీఆర్ఏస్ రద్దు.. కలెక్టర్ 

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లాలోని అన్ని డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో  పిజిఆర్ఏస్ రద్దు చేసున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు. 

Similar News

News December 1, 2025

ఆఖరి రాగం పాడేద్దామా..!

image

చూస్తుండగానే 2025లో డిసెంబర్ వచ్చేసింది. 30 రోజులు ఆగితే చివరి పేజీ కూడా చిరిగిపోతుంది. 2025ను సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు, గుణపాఠాలు. కొన్ని స్వీట్‌గా, కొన్ని ఘాటుగా, ఇంకొన్ని కాస్త కాస్ట్లీ. మిక్చర్ ప్యాకెట్ లాంటి మిక్స్డ్ ఫీల్ ఇయర్‌లో మీ బెస్ట్ ప్లేస్, మెమొరి, బ్యాడ్ డే.. ఇలా డైలీ ఓ విషయం షేర్ చేసుకుందాం. ఈ ఇయర్‌కు ఇలా ఆఖరి రాగం పాడేద్దాం!
రోజూ 7pmకు స్పెషల్‌గా కలుద్దాం.

News December 1, 2025

జిల్లాలో నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి 31 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.