News March 3, 2025

ఏలూరు : పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.

Similar News

News March 27, 2025

మొగల్తూరుపై పవన్ ఫోకస్.. కారణం ఇదే!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి స్వగ్రామం మొగల్తూరు. తండ్రిది పెనుగొండ. దీంతో ఈ రెండు గ్రామాలపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు చోట్ల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా పవన్ పేషీకి సంబంధించిన అధికారులు ఈ రెండు గ్రామాలకు వస్తారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పవన్‌కు వివరించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపడతారు.

News March 27, 2025

ప.గో జిల్లాలో టెన్షన్.. టెన్షన్

image

పశ్చిమగోదావరి జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, ఉపసర్పంచ్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. అత్తిలి, యలమంచిలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఓ ఐదారు మంది వైసీపీకి హ్యాండ్ ఇస్తే ఆ ఎంపీపీ పదవులు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ దిశగా కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. వైసీపీకి షాక్ ఇస్తారా? లేదా ఆ స్థానాలను వైసీపీనే నిలబెట్టుకుంటుందా? చూడాలి. మరోవైపు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

News March 27, 2025

భీమవరంలో ప్రేమ పేరుతో మోసం

image

ప్రేమంటూ మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన ఓ యువతిని గుడిసె ఉదయ్ ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఈక్రమంలో 2023 మేలో ఆమెను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చాడు. ఇటీవల యువతి గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. ఈనెల 22న యువతి ఫిర్యాదు చేయగా.. ఉదయ్‌ను అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం తణుకు జైలుకు తరలించారు.

error: Content is protected !!