News March 3, 2025
ఏలూరు : పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.
Similar News
News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News July 11, 2025
జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ కేంద్రం బృందాలు పర్యటన: కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలు ఎంపికలో భాగంగా కేంద్రం నుంచి అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (AMS )బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర ఏఎంఎస్ బృంద సభ్యులు ఏలూరులో కలెక్టర్‌ను కలిశారు. రోజుకు 2 గ్రామాల చొప్పున 36 గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు.
News July 11, 2025
KNR: RTC DMలతో RM సమీక్షా సమావేశం

KNR రీజియన్ పరిధిలోని డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం, 11 మంది డిపో మేనేజర్లతో RM బి.రాజు KNR బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సం. ప్రథమ త్రైమాసికంలో రీజియన్ లోని అన్ని డిపోల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎల్లవేళలా తగినన్ని బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.