News February 3, 2025
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..ఎస్పీ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు ఇవ్వడానికి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News February 24, 2026
కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు దుర్మరణం!

జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సిమ్రియా సమీపంలో సోమవారం సాయంత్రం కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగిందని చత్రా జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ధ్రువీకరించారు.
News February 24, 2026
ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై కేసు

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను MLA నెట్టేశారణే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
News February 24, 2026
శ్రీకాకుళంలో ప్రభలిన డయేరియా

శ్రీకాకుళం పట్టణంలోని మేదరవీది, గోల్కొండ రేవు రోడ్డు పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న పలువురు డయోరియా కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు, ప్రజా వైద్య శాలలో ఆదివారం రాత్రి నుంచి బాధితులు చికిత్స పొందుతున్నారు. సుమారు 25 మంది వరకూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యగా ఉందని స్థానికులు అంటున్నారు.


