News February 9, 2025
ఏలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రోగ్రాం నిలిపివేశామని, ప్రజలు గమనించాలని సూచించారు.
Similar News
News April 17, 2026
KNR: సమ్మర్ ఎఫెక్ట్.. ఇంటికే అంగన్వాడీ సరుకులు

రాష్ట్రంలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అంగన్వాడీ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హౌస్ రేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. మే 1-31 వరకు ఉడకబెట్టిన గుడ్లు, బాలామృతం, పాలు, మురుకులు ఇంటికెళ్లి అందజేస్తారు. ఉమ్మడి KNR(D)లో 3135 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు 1.80 లక్షల మంది, గర్భిణీలు, బాలింతలు 38వేల మంది ఉన్నారు.
News April 17, 2026
డీసెట్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు: డీఈవో

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇంటర్ అర్హతతో రెండేళ్ల డీఎల్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్‌కు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో డా.ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో వెలువడుతున్నాయని వివరించారు. వివరాలకు cse.a p.gov.in, apdeecet.apcfss.in ను సంప్రదించాలని సూచించారు.
News April 17, 2026
ఖమ్మం: భానుడి భగభగ.. మూగజీవాల విలవిల

ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 42 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనంతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు అడవుల్లో నీరు దొరక్క మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం, మట్టి తవ్వకాలు పెరగడంతో దుప్పులు, అడవి పందులు, కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


