News January 25, 2025
ఏలూరు: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావల్సిందేనని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరులో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భధ్రతా, రోడ్డు భధ్రతా వారోత్సవాలపై ఎస్పీ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు భధ్రతా నిబంధనలను ప్రజలతో పాటు అధికారులు కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు.
Similar News
News February 7, 2025
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.
News February 7, 2025
విజయవాడ: ఆ ప్రాంతాల్లో 6 రైళ్లు రద్దు

విజయవాడ రైల్వే డివిజన్‌లో నాన్ ఇంటర్ ల్యాకింగ్ పనులు నిమిత్తమై పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. RJY-VJA (67261), (67201) VJA-RJY (67262), (67201), KKD పోర్ట్-VJA (17257), VJA-KKD పోర్ట్ (17257) శనివారం రద్దు అవుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
News February 7, 2025
తిరుపతి: 66 ఉద్యోగాలకు దరఖాస్తులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్‌లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.