News May 18, 2024

ఏలూరు: ప్రాణం తీసిన కరెంట్ తీగ

image

చేపల చెరువు వద్ద పనిచేసే ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొనికి గ్రామానికి చెందిన పండు చైతన్యబాబు (28) అదే గ్రామంలోని శివప్రసాదరాజుకు చెందిన చేపల చెరువుకు కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం చెరువుగట్టుపై విద్యుత్తు తీగతెగిపడి ఉండటాన్ని గమనించక కాలు వేయగా విద్యుదాఘాతానికి గురవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

Similar News

News November 8, 2025

ఈ నెల 12న జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ మురళీ కృష్ణంరాజు, భీమవరం ఇన్‌ఛార్జి వెంకట్రాయుడు తెలిపారు. శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతోందని, దానిలో భాగంగా 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

News November 8, 2025

పాలకొల్లు: నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి

image

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేశ్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

News November 8, 2025

నరసాపురం: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

నరసాపురం(M) సీతారామపురంలోని 216 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సీతారామపురం నార్త్ గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ (72)గా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.