News March 12, 2025

ఏలూరు: ప్రేమించి నమ్మించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

ఆన్‌లైన్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి  ఏలూరు రూరల్ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే తక్కువ కులానికి చెందిన దానివని అవమానంగా దూషించడాని పోలీసులకు తెలిపింది. యువతి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రాజమండ్రికి చెందిన శివగిరి సందీప్‌ ఆన్‌లైన్‌లో పరిచయమై ఆమెను మోసం చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 11, 2025

మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

image

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

News July 11, 2025

ఓరుగల్లు: బీసీ రిజర్వేషన్.. స్థానిక ఎన్నికల్లో ఉత్కంఠ.!

image

రాష్ట్ర ప్రభుత్వ బీసీ 42% రిజర్వేషన్‌ ఆర్డినెన్స్ అంశంపై గ్రామాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబరు 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్‌లో 1702 పంచాయతీలు, 775 ఎంపీటీసీ, 75 జడ్పీటీసీ స్థానాల కోసం అశావహులు ఎదురు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌తో ఉమ్మడి జిల్లాలో 700 పంచాయతీలు, 325 ఎంపీటీసీ స్థానాలు బీసీల పరం కానున్నాయి.

News July 11, 2025

జనాభా లెక్కల్లోనూ రంగారెడ్డి జిల్లా తగ్గేదేలే!

image

రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.