News September 21, 2024
ఏలూరు: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ జారీ

ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి శుక్రవారం ఏలూరు డీఎస్పీ శ్రావణ కుమార్ను ఆశ్రయించింది. తాను చనిపోయినట్లు చూపించి 70 సెంట్లు భూమిని భలే హానొక్ పేరుపై మార్చారని ఆరోపించింది. రాణి చనిపోయినట్టుగా 2012లో డెత్ సర్టిఫికెట్పై సాక్షి సంతకాలు పెట్టిన ఘంటసాల నాగార్జున, సైదు వీరయ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.

News November 20, 2025
30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న 30 గ్రామాల డేటా ఎంట్రీని పూర్తి చేసి, వెంటనే సర్టిఫికెట్లు పంపాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం ఆయన మాట్లాడారు. భూ యజమానులకు కొనుగోలు, అమ్మకాలకు ఆటంకాలు ఉండకూడదన్నారు. థర్డ్ ఫేస్ రీ-సర్వేకు రైతులను రప్పించేందుకు తహశీల్దార్లు మరింత కృషి చేయాలని ఆదేశించారు. జీవో 30 భూముల పూర్తి నివేదికను అందించాలని ఆయన కోరారు.