News December 19, 2024
ఏలూరు బార్ అసోసియేషన్‌లో ఐఏఎల్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్‌ను గురువారం ఏలూరు బారు అసోసియేషన్ హాల్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ ఏలూరు జిల్లా ప్రతినిధి బండి వెంకటేశ్వర రావు మాట్లాడారు. న్యాయవాదుల సమస్యలపై ఐఏఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, ఐఏఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్ ఎక్స్‌ప్రెస్ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.
News October 27, 2025
పేరుపాలెం బీచ్‌కు నో ఎంట్రీ

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్.ఐ. జి. వాసు తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలు (మూడు రోజులు) బీచ్‌కు పర్యాటకులు, యాత్రికులు రావద్దని, తుఫాను కారణంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
News October 27, 2025
ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.


