News March 17, 2025

ఏలూరు : బాలికపై అత్యాచారం .. కేసు

image

ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన పౌలు (20) అనే ఆటో డ్రైవర్‌పై రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 15 ఏళ్ల బాలికకు ప్రేమించానని మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Similar News

News December 9, 2025

శబరిమల: 18 మెట్లు – వాటి పేర్లు

image

1.అణిమ, 2.లఘిమ, 3.మహిమ, 4.ఈశత్వ, 5.వశత్వ, 6.ప్రాకామ్య, 7.బుద్ధి, 8.ఇచ్ఛ, 9.ప్రాప్తి, 10.సర్వకామ, 11.సర్వ సంవత్సర, 12.సర్వ ప్రియకర, 13.సర్వ మంగళాకార, 14.సర్వ దుఃఖ విమోచన, 15.సర్వ మృత్యుత్వశమన, 16.సర్వ విఘ్న నివారణ, 17.సర్వాంగ సుందర, 18.సర్వ సౌభాగ్యదాయక. ఈ 18 పేర్లు సిద్ధులు, సర్వ శుభాలకు ప్రతీక. ఇవి దాటితే అన్ని రకాల సౌభాగ్యాలను, విఘ్న నివారణను పొందుతారని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>

News December 9, 2025

ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

News December 9, 2025

రాజధానిలో గ్రామకంఠాల సర్వే.. 13 బృందాలు రంగంలోకి

image

రాజధాని 29 గ్రామాల్లో గ్రామకంఠాల గందరగోళానికి చెక్ పెట్టేందుకు CRDA 13 సర్వే బృందాలను రంగంలోకి దించింది.
రైతులు మినహాయింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చి త్వరలో గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. నివేదికలు అందిన తర్వాత మినహాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.