News August 19, 2024

ఏలూరు: బాలికలతో అసభ్యప్రవర్తన.. టీచర్ సస్పెండ్

image

ఏలూరు జిల్లా చింతలపూడి జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.సంపత్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఉపాధ్యాయుడు సంపత్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 8, 9వ తరగతి విద్యార్థులు డీఈవో అబ్రహంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆయన విచారణకు ఆదేశించారు. విద్యార్థులు చెప్పిన విషయం నిజమేనని తేలడంతో సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 18, 2025

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

image

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.

News September 18, 2025

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. జేసీ హెచ్చరిక

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పీజీఆర్ఎస్, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా మాట్లాడి పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

News September 17, 2025

ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.