News March 29, 2024

ఏలూరు: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య SUICIDE

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన చినవెంకట సాంబమూర్తి RDO ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్. ఆయనకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంకు చెందిన రాధిక(31)తో 2010లో పెళ్లైంది. రెండ్రోజుల కింద రాధిక ఊరివేసుకొని మృతి చెందింది. అదనపుకట్నం తీసుకురావాలని తరచూ భర్త వేధించడం వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

Similar News

News February 12, 2026

రైతులను ఇబ్బంది పెడితే వేటే.. అధికారులకు జేసీ వార్నింగ్!

image

అప్సడ (APSADA) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రైతులను ఇబ్బంది పెట్టినా, అవినీతికి పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులను అనవసరంగా వీఆర్వోల వద్దకు పంపవద్దని ఆదేశించారు. విధి నిర్వహణలో పారదర్శకత ఉండాలని, రైతుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 11, 2026

తణుకు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో మృతి

image

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగాలేదని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది. దీంతో తాతారావును తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News February 11, 2026

యనమదుర్రు పెట్రోల్ బంక్‌లో జేసీ ఆకస్మిక తనిఖీ

image

యనమదుర్రులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతలు, ధరల ప్రదర్శనతో పాటు భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.