News March 14, 2025
ఏలూరు : భార్యతో గొడవపడి భర్త సూసైడ్

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో గురువారం జరిగింది. పవర్ పేట పిల్లా వారి వీధికి చెందిన సుశీల్ (42) బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం లేచేసరికి ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారమందుకున్న టూటౌన్ సీఐ వైవీ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News March 15, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.-
News March 15, 2025
అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.
News March 15, 2025
హైదరాబాద్ నుంచే 50% ఆదాయం!

TG: 2022-23 లెక్కల ప్రకారం రాష్ట్ర జీడీపీలో హైదరాబాద్ వాటా 50.41%గా ఉందని తాజాగా వెల్లడైంది. దీని ప్రకారం మిగతా జిల్లాలు ఆశించినంతగా ఆదాయం తీసుకురావట్లేదని అర్థమవుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక్క నగరం ఇంత సంపద తీసుకురావట్లేదు. ముంబై ఆదాయం 36.3%, బెంగళూరు 40.91%, చెన్నై 31.59%గా ఉంది. మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వికేంద్రీకరణ జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.