News August 8, 2024

ఏలూరు: ‘భార్యను అందుకే చంపాను’

image

కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో భార్యను భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంలో హత్య జరినట్లు DSP తెలిపారు. సూర్యచంద్రానికి 11ఏళ్ల క్రితం సాయిలక్ష్మితో పెళ్లి జరిగింది. కొన్నేళ్లుగా గొడవలు జరగడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో నిన్న వారి మధ్య వాగ్వాదం జరగగా కోపంతో సూర్యచంద్రం రోడ్డుపై ఆమె మెడపై కత్తితో నరికినట్లు తెలిపాడు.

Similar News

News September 8, 2024

గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత

image

వరదలు, భారీ వర్షాల దృష్ట్యా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ఆదివారం మూసివేస్తున్నట్లు ఆర్డీవో కె.అద్దయ్యయ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News September 7, 2024

ఈనెల 10 ఏలూరులో జాబ్ మేళా.. 165 పోస్టులు

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని ప్రభుత్వ డీఎల్‌టీసీ, ITI కళాశాలలో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 165 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా ఉంటుందని అన్నారు.

News September 7, 2024

ప.గో జిల్లాలో భారీ వర్షం.. ఉద్ధృతంగా కాలువలు

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం పడింది. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలం నుంచి బర్రింకలపాడు వెళ్లే రహదారిలో కాలువ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ఉన్నప్పుడు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు కోరుతున్నారు.