News August 9, 2024

ఏలూరు: భార్యను హతమార్చిన భర్త అరెస్ట్

image

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో మహిళ హత్యకు సంబంధించి ఆమె భర్త సూర్యచంద్రంను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ శుక్రవారం తెలిపారు. ఈనెల 7న రామానుజపురంలో రాజనాల సాయిలక్ష్మిని ఆమె భర్త సూర్యచంద్రం హత్య చేశాడన్నారు. భార్య వేధింపులు, గొడవల వల్ల హత్య చేసినట్లు సూర్యచంద్రం ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు.

Similar News

News October 24, 2025

కలెక్టరేట్‌లో కంట్రోలు రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. శుక్రవారం భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో 88162 99219 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

News October 23, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి
గురువారం అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299219 ఏర్పాటు చేశామన్నారు.

News October 23, 2025

రేపు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్ నాగరాణి
గురువారం ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, చెరువుల దగ్గరగా ఉండకుండా అందరికీ సమాచారం అందించాలన్నారు. రియల్ టైమ్ సమాచారం వస్తుందని, దానిని ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.