News August 1, 2024
ఏలూరు: భార్యలను కాపురానికి పంపాలని అల్లుళ్ల నిరసన
తమ భార్యలను కాపురానికి పంపించాలంటూ ఏలూరులో తోడి అళ్లుళ్లు ఆందోళనకు దిగారు. ‘ఏలూరుకు చెందిన రామానుజ శ్రీనివాస అయ్యంగార్ కుమార్తెలను మేము పెళ్లి చేసుకున్నాం. వాళ్ల ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తెల జీతాలతో మా అత్తింటి ఫ్యామిలీ జీవనం గడుపుతోంది. అందుకే వాళ్లను మాతో పంపడం లేదు. ఇదే విషయమై మేము అడుగుతుంటే రివర్స్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు’ అని పవన్, శేషసాయి కలెక్టరేట్ ఎదుట వాపోయారు.
Similar News
News December 1, 2024
వెలవెలబోయిన పేరుపాలెం బీచ్
కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులతో కళకళలాడే పేరుపాలెం బీచ్ ఆదివారం వెలవెలబోయింది. అల్పపీడనం ఎఫెక్ట్‌తో బీచ్‌లో పెద్ద పెద్ద రాకాసి అలలు వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పర్యాటకులను రావొద్దని హెచ్చరించింది. దీంతో పర్యాటకులు బీచ్‌కు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది.
News December 1, 2024
కాళ్ల: లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు స్పాట్ డెడ్
బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
News December 1, 2024
రైతులకు కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..
ప.గో జిల్లాలో ఫెంగల్ తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు నష్టపోకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలను రైతులకు జారీ చేశారు. వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకోవాలని, అలాగే ఇప్పటికే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలి అన్నారు. సమాచారం కోసం 8121676653, 18004251291 సంప్రదించవచ్చని అన్నారు.