News July 14, 2024
ఏలూరు: భార్య వదిలివెళ్లిందని భర్త సూసైడ్

ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఏలూరు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకు చెందిన రాజు విహారి (32) భార్య ఏడాది క్రితం అతణ్ని వదిలేసి వెళ్లిపోయింది. మనస్తాపంతో రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలతోనే కొంతదూరం నడిచి బంధువుల ఇంటి వద్ద పడిపోయాడు. విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.
Similar News
News November 13, 2025
తణుకులో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్

తణుకు పట్టణానికి గురువారం ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
News November 13, 2025
భీమవరంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

భీమవరం (M) కొవ్వాడలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హేమవర్షిని (22) భీమవరంలో బీడీఎస్ చదువుతుంది. మంగళవారం తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయలేదు. స్నేహితులు కొవ్వాడలో ఇంటికి వెళ్లికి చూడగా ఉరివేసుకున్నట్లు గుర్తించి తండ్రి సింహాచలం, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
జిల్లాలో వందే భారత్.. నరసాపురం వరకు పొడిగింపు

జిల్లాలో మొట్ట మొదటిగా వందే భారత్ రైలు నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 12 నుంచి నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 20677 రైలు చెన్నై నుంచి జనవరి 12న 5.30 బయలుదేరి 14.10కి నరసాపురం చేరుతుంది. తిరిగి అదే రోజు నరసాపురంలో 14.50 బయలుదేరి 23.45కు చెన్నై చేరుతుంది. జిల్లాలో ఈ రైలు భీమవరం, నరసాపురంలో ఆగుతుంది.


