News March 1, 2025
ఏలూరు: మధ్యాహ్న భోజనం ఫుడ్ మెనూ ఇదే..

ప.గో జిల్లాల్లోని పాఠశాలల్లో శనివారం నుంచి అందించే కొత్త ఫుడ్ మెనూ ఇలా ఉంది. సోమవారం: రైస్, ఆకుకూర, పప్పు, ప్రైడ్ ఎగ్, చిక్కి, మంగళవారం: లెమన్/ టమోటా రైస్, బాయిల్డ్ ఎగ్, రాగి జావ, చెట్నీ, బుధవారం: రైస్, మిక్సిడ్ వెజిటెబుల్ కర్రీ, ఎగ్, గురువారం: వెజిటెబుల్ రైస్/పలావ్, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్, రాగిజావ, శుక్రవారం: రైస్, పప్పు, ఆకుకూరలు, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ, శనివారం: రైస్, కర్రీ, ఫ్రైడ్ ఎగ్, చిక్కి.
Similar News
News March 21, 2025
ప.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

ప.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా భీమవరంలో గురువారం 36.54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గణపవరంలో ఇవాళ దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.
News March 21, 2025
తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.