News December 17, 2024
ఏలూరు: మహమ్మద్‌కు ఎంత కష్టమొచ్చిందో..!

ఏలూరు మినీ బైపాస్ వద్ద లారీకి ఉరేసుకొని మృతి చెందిన వ్యక్తి వివరాలను త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. CI వివరాల ప్రకారం.. మృతుడు బీహార్‌కు చెందిన మహమ్మద్ (25)గా గుర్తించామన్నారు. ఏలూరులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడు ఉరివేసుకునే ముందు ఫోన్‌లో సంభాషణలు జరిపాడని ఈ తరుణంలో ఉరేసుకున్నాడని ప్రాథమిక విచారణకు వచ్చామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 23, 2025
జాతీయ కరాటే పోటీల్లో భీమవరం విద్యార్థికి కాంస్యం

మధ్యప్రదేశ్లో జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో భీమవరం ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన ఎస్. ఆహిల్ సత్తా చాటారు. అండర్-14 విభాగంలో పాల్గొన్న ఈ క్రీడాకారుడు దేశవ్యాప్తంగా 3వ స్థానం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఏపీ నుంచి మొత్తం 21 మంది కరాటే పోటీలలో ప్రాతినిధ్యం వహించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తే అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించవచ్చని కోచ్ సుభాన్ అన్నారు.
News December 23, 2025
ప.గో: గుడ్ న్యూస్ చెప్పిన జేసీ

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
News December 23, 2025
విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకే సైన్స్ పెయిర్లు: కలెక్టర్

విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. వీరవాసరం జడ్పీ హైస్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రారంభించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 146 సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు.


