News December 17, 2024

ఏలూరు: మహమ్మద్‌కు ఎంత కష్టమొచ్చిందో..!

image

ఏలూరు మినీ బైపాస్ వద్ద లారీకి ఉరేసుకొని మృతి చెందిన వ్యక్తి వివరాలను త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. CI వివరాల ప్రకారం.. మృతుడు బీహార్‌కు చెందిన మహమ్మద్ (25)గా గుర్తించామన్నారు. ఏలూరులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడు ఉరివేసుకునే ముందు ఫోన్‌లో సంభాషణలు జరిపాడని ఈ తరుణంలో ఉరేసుకున్నాడని ప్రాథమిక విచారణకు వచ్చామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News January 24, 2025

ప.గో. త్వరలో ఆచంటలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు

image

ఆచంటలో రూ.కోటి వ్యయంతో త్వరలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉక్కు భారీ పరిశ్రమల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం ఆచంట మండలం ఏ వేమవరం గ్రామంలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ కేంద్రం మంజూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాత్ర ఎంతో ఉందన్నారు.

News January 23, 2025

ప.గో: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

image

ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

News January 23, 2025

పెంటపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎస్సీ పేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీ పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.