News March 18, 2025
ఏలూరు: మహిళపై అత్యాచారం

తనకు న్యాయం చేయాలని అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయింది.
Similar News
News March 18, 2025
ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.
News March 18, 2025
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే వెళ్లారు.. చివరకు..!

బట్టతలపై జుట్టు వస్తుందనుకున్న 67 మంది మోసపోయారు. పంజాబ్లోని సంగ్రూర్లో ఇద్దరు వ్యక్తులు జుట్టు చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. తాము అందించే నూనె వాడితే జుట్టు వస్తుందని చెప్పగా స్థానికులు నమ్మారు. చివరకు ఆ నూనె వాడిన 67 మంది ఇన్ఫెక్షన్లు వచ్చి ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు శిబిరం నిర్వహించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎలాంటి నైపుణ్యం, అనుమతి లేకుండా వారు శిబిరం నిర్వహించినట్లు చెప్పారు.
News March 18, 2025
తిరుపతిలో దాడిపై స్పందించిన ఈసీ

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో హింస జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎట్టకేలకు స్పందించింది. ఎంపీ గురుమూర్తి చేసిన ఆరోపణలపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఈసీ ముఖ్య కార్యదర్శి కేఆర్బీ హెచ్ఎన్ చక్రవర్తి లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేశారని ఈసీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.