News March 31, 2025
ఏలూరు: మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్‌రూమ్‌లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్‌పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్‌వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్‌కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.
Similar News
News October 29, 2025
‘బ్రేకప్ అయింది సర్.. లీవ్ కావాలి’

లీవ్ కోసం ఓ ఉద్యోగి తన బాస్‌కు పంపిన రిక్వెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇటీవలే నాకు బ్రేకప్ అయింది. పనిపై దృష్టి పెట్టలేకపోతున్నా. నాకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు సెలవు కావాలి’ అని ఎంప్లాయ్ పెట్టిన మెయిల్‌ను ‘Knot Dating’ సంస్థ CEO జస్వీర్ సింగ్ షేర్ చేశారు. అత్యంత నిజాయతీగా అడగడంతో వెంటనే లీవ్ ఇచ్చానని పేర్కొన్నారు. దీనికి లైకులు, కామెంట్లు పోటెత్తుతున్నాయి.
News October 29, 2025
ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుకల నేపథ్యంలో ఐక్యత పాదయాత్ర (యూనిటీ మార్చ్) చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఐక్యత పాదయాత్ర నిర్వహణ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటేల్ జయంతి ఉత్సవాల వేడుకలను చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News October 29, 2025
WGL: ఇంటర్ కళాశాలలకు సెలవు

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వరంగల్ డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమాచారం చేరవేస్తూ సెలవు ప్రకటించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపధ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.


