News September 29, 2024

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై చీటింగ్ కేసు

image

ఏలూరు మాజీ MLA ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. త్రీ-టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో ఏలూరులోని ఓ అపార్ట్మెంట్‌లో లిఫ్ట్ దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన తనను ఆదుకుంటానని, వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పిన ఆళ్ల నాని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అవుటుపల్లి నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో నానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News October 27, 2025

తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

image

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

News October 27, 2025

పేరుపాలెం బీచ్‌కు నో ఎంట్రీ

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్.ఐ. జి. వాసు తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలు (మూడు రోజులు) బీచ్‌కు పర్యాటకులు, యాత్రికులు రావద్దని, తుఫాను కారణంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

News October 27, 2025

ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

image

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.