News September 29, 2024
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై చీటింగ్ కేసు
ఏలూరు మాజీ MLA ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. త్రీ-టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో ఏలూరులోని ఓ అపార్ట్మెంట్‌లో లిఫ్ట్ దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన తనను ఆదుకుంటానని, వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పిన ఆళ్ల నాని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అవుటుపల్లి నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో నానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News October 4, 2024
రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్‌గా ఏలూరు జిల్లా నేత బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్‌గా పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ స్టేట్ డైరెక్టర్ షేక్ సుభాని, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
News October 4, 2024
ప.గో: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!
భీమవరానికి చెందిన యువతిని సత్యసాయిజిల్లాకు చెందిన వేమారెడ్డి పెళ్లి చేసుకొని మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.
News October 4, 2024
ప.గో: దసరా వేళ.. భారీగా వసూళ్లు
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు ప.గో జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెల రోజుల క్రితమే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.