News September 21, 2024
ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
రైల్వే లైన్ల పునరుద్ధరణ పనుల కారణంగా ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29న తిరుపతి- విశాఖపట్నం, 30న విశాఖపట్నం- తిరుపతి, విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, రాజమహేంద్రవరం – విశాఖపట్నం, అలాగే అక్టోబర్ 1న విశాఖపట్నం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News October 5, 2024
APIIC ఛైర్మన్‌గా మంతెన రామరాజు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (APIIC) ఛైర్మన్‌గా మంతెన రామరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని రామరాజు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన్ను వారు అభినందించారు.
News October 5, 2024
ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు
ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. లీటరు పెట్రోల్ శుక్రవారం, శనివారం రెండు రోజులూ రూ.109.64 ఉంది. దీంతో పాటు డీజిల్ ధరలో కూడా నిన్నటికీ నేటికీ వ్యత్యాసం లేదు. ప్రస్తుతం రూ.97.46 ఉంది.
News October 5, 2024
ప.గో: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ యువతి మృతి
నిడదవోలుకు చెందిన దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసుల కథనం..సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫ్రెండ్స్‌తో రాజమండ్రి చూసి వస్తానని శుక్రవారం ఇంట్లో చెప్పి వచ్చింది. 9 మంది 4 బైకులపై బయలుదేరారు. కోరుకొండ నారసింహున్ని దర్శించుకుని వస్తూ.. బూరుగుపూడి జంక్షన్ వద్ద బైకు నడుపుతున్న దీప్తి, టాటా ఏసీని ఢీకొట్టి ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.