News September 12, 2024
ఏలూరు: ముద్దాయికి జైలు శిక్ష.. జరిమానా

ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ వాసుదేవ్ ఏలూరు 1- Town పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి, ముద్దాయి బడిగంటల లీల రాజు 3 సం.ల 15 రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.6500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలత వాదనలను వినిపించి ముద్దాయికి శిక్ష పడటంలో సహకరించారన్నారు.
Similar News
News November 16, 2025
యలమంచిలి: ‘పారిశ్రామిక వేత్తలు వస్తుంటే జగన్ ఓర్వలేక పోతున్నారు’

రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తల, పరిశ్రమలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలో రూ. 55 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులకు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
News November 15, 2025
ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.
News November 15, 2025
గుంటూరులో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

మహిళల బ్యాగుల్లో నుంచి బంగారం నగలు దొంగలిస్తున్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెం యాగరపల్లికి చెందిన ఆరుగురు దొంగల ముఠాను గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందడంతో శుక్రవారం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.22లక్షల విలువైన 75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు.


