News September 12, 2024
ఏలూరు: ముద్దాయికి జైలు శిక్ష.. జరిమానా
ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ వాసుదేవ్ ఏలూరు 1- Town పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి, ముద్దాయి బడిగంటల లీల రాజు 3 సం.ల 15 రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.6500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలత వాదనలను వినిపించి ముద్దాయికి శిక్ష పడటంలో సహకరించారన్నారు.
Similar News
News October 6, 2024
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే RRR
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
News October 6, 2024
నరసాపురంలో పదేళ్ల బాలికతో అసభ్యకర ప్రవర్తన
పదేళ్ల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపట్ల యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News October 6, 2024
ఏలూరు: జాతీయ రహదారి సమస్యలు పరిష్కరిస్తా: MP
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని 216-ఎ- జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో నెలకొన్న రహదారి సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన భీమడోలులోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు.