News March 26, 2025

ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

image

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.

Similar News

News October 19, 2025

ALERT: టపాసులు కాలుస్తున్నారా?

image

దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయొద్దని సూచిస్తున్నారు. పొగ, దుమ్ము లంగ్స్‌పై ప్రభావం చూపుతాయని, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్‌కు దారి తీస్తాయంటున్నారు.

News October 19, 2025

జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

News October 19, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీచ్ కానీ టార్గెట్..!

image

ఉమ్మడి KNR జిల్లాలో 2025-27కు గాను వైన్ షాప్ టెండర్ల ద్వారా రూ.380 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 287 వైన్ షాపులకు గాను 7188 దరఖాస్తుల ద్వారా రూ.215.64 కోట్ల ఆదాయం వచ్చింది. క్రితంసారి 10,734 దరఖాస్తులకు గాను 214.68 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి 3,546 దరఖాస్తులు తక్కువగా వచ్చినా రూ.కోటి 4 లక్షల ఆదాయం పెరిగింది. ఈనెల 23లోపు టార్గెట్ రీచ్ అవుతోందో, కాదో వేచి చూడాలి.