News July 9, 2024
ఏలూరు: మూడేళ్ల తర్వాత అమ్మ చెంతకు

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ బాలుడు 2021లో ఇంటినుంచి వెళ్లిపోయాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా అక్కడి పోలీసులు చైల్డ్ కేర్ సంస్థలో చేర్చారు. ఈ క్రమంలో బాలుడిది ఏలూరు జిల్లాగా గుర్తించి ఇక్కడి అధికారులను సంప్రదించారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లిని బుట్టాయగూడెంలో గుర్తించి అప్పగించారు.
Similar News
News February 24, 2026
పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.