News February 22, 2025
ఏలూరు: యాంటీరాబీస్, శస్త్ర చికిత్సలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి కుక్కులకు యాంటీరాబీస్ వ్యాక్సిన్, బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలను ఏప్రిల్ మాసాంతానికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలక సంబంధిత అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 17, 2025
నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ

ఆసిఫాబాద్ జిల్లాలో జిన్నింగ్ (పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని ఆసిఫాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి అష్పక్ సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.
News November 17, 2025
ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

AP: ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నది తానొక్కడినేనని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘రాజకీయం అంటే ఏంటో ఎన్టీఆర్ నేర్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు’ అని అన్నారు. హిందూపురం ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.


