News July 28, 2024

ఏలూరు: యువతితో అసభ్య ప్రవర్తన.. కత్తితో దాడి

image

అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఓ యువతి కత్తితో దాడి చేసింది. సదరు యువతి కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ద్వారకాతిరుమలలో తిరుగోతుంది. అదే గ్రామానికి చెందిన తిరునగరి రమేశ్ మద్యం మత్తులో కొద్దిరోజులుగా ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీవారి పాదుకా మండపంలో నిద్రిస్తున్న రమేశ్‌ చేతిపై, ముఖంపై చాకుతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 8, 2025

భీమవరం: బ్యాంకుల అధికారులపై కలెక్టర్ అసహనం

image

పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎస్‌హెచ్‌సి గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలని సూచించారు.

News November 7, 2025

ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.

News November 7, 2025

భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

image

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.