News March 31, 2025
ఏలూరు: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

ఏలూరు జిల్లాలోని ముస్లింలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమ శిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతన కలయిక రంజాన్ అని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ముస్లింలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వెట్రిసెల్వి అన్నారు.
Similar News
News December 8, 2025
మేడారం జాతర సమయంలో ఐటీడీఏ పరిధిలోనే సెలవులు..!

మేడారం జాతర 1996లో స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించబడింది కానీ, జాతర జరిగే ఆ నాలుగు రోజులు మాత్రం సెలవులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సెలవులు ఇచ్చినా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని మండలాలకే పరిమితం చేశారు. ములుగు జిల్లాలోని విద్యా సంస్థలు తాత్కాలిక సెలవులు ఇస్తున్నాయి. మేడారం మాస్టర్ ప్లాన్ కు రూ.200కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సెలవులు కూడా ఇచ్చి భక్తుల మనోభావాలు గౌరవించాల్సి ఉంది.
News December 8, 2025
మచిలీపట్నం: అనాథ పిల్లలకు అమృత ఆరోగ్య కార్డులు

మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాథ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి ఆరోగ్య భద్రతపై అవగాహన కూడా కల్పించారు.
News December 8, 2025
మేడారం జాతరకు సెలవులివ్వరా?

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించలేదు. తాజాగా విడుదల చేసిన 2026ఏడాది సెలవుల జాబితాలో రాష్ట్ర పండుగను చేర్చలేదు. ఇది ముమ్మాటికీ మేడారం పట్ల సర్కారు నిర్లక్ష్యమేననే విమర్శలు వస్తున్నాయి. జాతీయ పండుగ హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న పాలకులు సొంత రాష్ట్రంలో జరుగుతున్న జాతరకు సెలవులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జనవరి 28నుంచి 30వరకు జాతర జరుగుతుంది.


