News March 6, 2025
ఏలూరు : రహదారి ప్రమాదంలో మృతి చెందింది వీరే..!

ఏలూరు రూరల్ 16 నంబర్ జాతీయ రహదారిపై సోది మెల్ల వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలుకు చెందిన బొంతు భీమేశ్వరరావు(43), జగ్గంపేట సమీపంలోని కాట్రవారి పల్లికి చెందిన మొటపర్తి భవాని(23), కోనసీమ జిల్లా వింజరం కోలంకకు చెందిన జుత్తిగ భవాని (38), మధు అలియాస్ నాని (బస్సు డ్రైవర్) గా గుర్తించారు.
Similar News
News March 7, 2025
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

*HYDలో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి ఆమోదం
*ORRకు ఇన్నర్ సైడ్ ప్రాంతం కోర్ తెలంగాణ.. ORR నుంచి RRR వరకు అర్బన్ తెలంగాణ. మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణ
*సెర్ప్, మెప్మాల విలీనం
*మహిళా సంఘాల వయోపరిమితి 15-65 ఏళ్లుగా నిర్ణయం
*డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం
*యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
News March 7, 2025
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 7, 2025
మహిళా సదస్సు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.