News March 6, 2025

ఏలూరు : రహదారి ప్రమాదంలో మృతి చెందింది వీరే..!

image

ఏలూరు రూరల్ 16 నంబర్ జాతీయ రహదారిపై సోది మెల్ల వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలుకు చెందిన బొంతు భీమేశ్వరరావు(43), జగ్గంపేట సమీపంలోని కాట్రవారి పల్లికి చెందిన మొటపర్తి భవాని(23), కోనసీమ జిల్లా వింజరం కోలంకకు చెందిన జుత్తిగ భవాని (38), మధు అలియాస్ నాని (బస్సు డ్రైవర్) గా గుర్తించారు.

Similar News

News March 20, 2025

జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

image

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 22.564 టీఎంసీలకు చేరింది. యాసంగి పంటల సాగునీరు, తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా విడుదల జరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5,000, లక్ష్మి కెనాల్ ద్వారా 250, అలీసాగర్ లిఫ్ట్‌కు 540 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తెలిపారు.

News March 20, 2025

యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

image

TG: సూర్యాపేట (D) హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.

News March 20, 2025

‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

image

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.

error: Content is protected !!