News April 10, 2026

ఏలూరు: రూ. 220 కోట్లతో రహదారుల నిర్మాణం: కలెక్టర్

image

జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.220 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. శుక్రవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుంచి GST వసూళ్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన GST వివరాలను ఎప్పటికప్పుడు శాఖకు సమర్పించాలని అధికారులకు సూచించారు.

Similar News

News April 20, 2026

@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

image

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.

News April 20, 2026

NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

image

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.

News April 20, 2026

సేంద్రియ మేళా సూపర్‌ హిట్: కలెక్టర్

image

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.