News April 15, 2025
ఏలూరు: రైలు కిందపడి ఒకరు మృతి

గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిమెంటు రంగు చొక్కా, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. SI సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 19, 2025
అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్‌సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
News April 19, 2025
నాగర్‌కర్నూల్: నీ సీఎం కుర్చీ గుంజేస్తాం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ చైతన్య సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. SLBCలో చనిపోయిన వారిలో ఏడుగురు బీసీలకు ఆయన నివాళులర్పించారు. మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు వెళ్తే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని గుంజేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర బీసీ నాయకులు పాల్గొన్నారు.
News April 19, 2025
రామప్ప కనుమరుగయ్యే అవకాశం ఉంది: పాండురంగారావు

సింగరేణి ఓపెన్ కాస్ట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే రాబోయే రోజుల్లో రామప్ప ఆలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. వెంకటాపూర్‌లోని ఆలయాన్ని సందర్శించి వారు మాట్లాడారు. రామప్ప దేవాలయం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగి, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం జిల్లాకే గర్వకారణమన్నారు.