News March 1, 2025
ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.
Similar News
News March 2, 2025
రూట్‌ను ఫాలోకండి.. బజ్‌బాల్‌ను కాదు: కైఫ్

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే వైదొలగడంపై భారత మాజీ క్రికెటర్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని ఫార్మాట్లలో బజ్‌బాల్‌ను గుడ్డిగా ఫాలో అవ్వొద్దు. “వన్ నేషన్, వన్ స్టైల్” పనిచేయదు. సక్సెస్ఫుల్ టీమ్స్ పరిస్థితులకు తగ్గట్లు అడ్జస్ట్ అవుతాయి. జో రూట్‌ను ఫాలో అవ్వండి.. బజ్‌బాల్‌ను కాదు’ అని ట్వీట్ చేశారు.
News March 2, 2025
TODAY HEADLINES

AP: జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తి: సీఎం చంద్రబాబు
AP: ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయసు పెంపు
AP: జైలులో పోసానికి అస్వస్థత.. నాటకం ఆడారన్న పోలీసులు
TG: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
TG: దేశానికి రోల్ మోడల్లా పోలీస్ స్కూల్: CM రేవంత్
TG: రేవంత్ మంచి పనులు చేయలేదు: KTR
☛ ఫిబ్రవరి GST కలెక్షన్స్ రూ.1.84లక్షల కోట్లు
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీస్‌కు సౌతాఫ్రికా
News March 2, 2025
ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.