News March 7, 2025

ఏలూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి 

image

ఏలూరు నిమ్మకాయల యాడ్ సమీప రైల్వేగేట్ వద్ద శుక్రవారం ఓ వ్యక్తి రైలు పట్టాలను దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సైమన్ మాట్లాడుతూ.. మృతుడు కాకర్ల నాగార్జున (28)గా గుర్తించామన్నారు. మృతుడు కోమడవోలు పంచాయతీగా నిర్ధారించామన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. 

Similar News

News February 7, 2026

ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త

image

ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News February 7, 2026

కల్వకుర్తి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

image

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్థానిక డీఎస్పీ వెంకటరెడ్డి పరిశీలించారు. సీఐ నాగార్జునతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 44 పోలింగ్ కేంద్రాలలో 20 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

News February 7, 2026

NZB: ‘పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్థవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.