News May 4, 2024

ఏలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ పరిధి పాతూరు రైల్వే గేట్ వద్ద శనివారం ఓ వ్యక్తి రైలు నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ నరసింహారావు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని స్పష్టం చేశారు.

Similar News

News January 5, 2026

పాలకొల్లు: ఇంటికి వెళ్లడానికి 4 గంటలు ఉందనగా..

image

పాలకొల్లుకు చెందిన దంపతులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరడానికి మరో 4 గంటల సమయం ఉందనగా ఈ విషాదం జరిగింది. మృతులు కొటికలపూడి రాజమోహన్ రావు కుమారుడు, కోడలుగా గుర్తించారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని వచ్చి చూసి వెళ్తుండగా మృత్యువాత పడటంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.

News January 5, 2026

ప.గో: లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

image

పాలకొల్లుకు చెందిన ప్రేమికులు రమేశ్, భాగ్యశ్రీ ఆదివారం తాళ్లరేవు మండలం సుంకరపాలెంలోని ఓ లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన యాజమాన్యం కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని చికిత్స కోసం యానం ఆసుపత్రికి తరలించారు. ఈ నెల ఒకటో తేదీన వారు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2026

తాడేపల్లిగూడెం YCP ఇన్‌ఛార్జ్ ఎవరో?

image

తాడేపల్లిగూడెం YCP ఇన్‌ఛార్జ్ మార్పుపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ కొట్టు సత్యనారాయణపై అసంతృప్తి నెలకొనడంతో కొత్తవారి కోసం పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇన్‌ఛార్జ్ రేసులో వడ్డి రఘురాం, కొట్టు నాగు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు లేదా ఇద్దరికీ బాధ్యతలు పంచుతారా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.