News January 21, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.
Similar News
News February 15, 2025
భీమవరం : గాయపడిన బాలుడి మృతి

భీమవరంలో ఈనెల 12న కోటేశ్వరరావు అనే బాలుడుకి(10) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కొక్కి తగులుకుని కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో గమనించిన స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 13న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాలుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
News February 15, 2025
పాలకొల్లు వాసి ఆత్మహత్య

ప.గో జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన చందనాలస్వామి(36) శ్రీకాకుళం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగా టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ ట్యాంకులో దూకి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించి, అతను టెక్కలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మెస్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
News February 15, 2025
ప.గో: ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యాన్ని నెరవేర్చాలి..కలెక్టర్

ఇల్లు కట్టుకోవాలనే ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని నెరవేర్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీ గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు.