News May 24, 2024
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 19, 2025
తణుకు: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాత టోల్ గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం.
News December 19, 2025
ముళ్లపూడి బాపిరాజుకు మరోసారి నిరాశ.?

జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశించిన ఉమ్మడి ప.గో. జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకి నిరాశే ఎదురైంది. కష్ట కాలంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. టీపీగూడెం నుంచి బాపిరాజు టికెట్టు ఆశించినా.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించారు. కనీసం పార్టీలో నామినేటెడ్ పదవి దక్కుతుందనుకున్న బాపిరాజుకు మరోసారి నిరాశ ఎదురయింది.
News December 19, 2025
ప.గో: బ్యాంకులో రూ. కోట్లు మాయం

ఆకివీడులో ఇటీవల డ్వాక్రా సంఘాల సొమ్మును యానిమేటర్లు రూ. కోట్లలో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యానిమేటర్లు రూ. 2.36 కోట్లు మాయం చేసినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు.19 డ్వాక్రా సంఘాలలో సుధారాణి రూ.1.39 కోట్లు,13 గ్రూపులకు సంబంధించి హేమలత రూ.96 లక్షల స్వాహా చేసినట్లు అధికారులు తేల్చారు. శుక్రవారం ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.


