News May 24, 2024

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 17, 2025

 ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.

News February 16, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్ 

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17 సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను (పీజీఆర్ఎస్) జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. ఆదివారం కలెక్టర్  ప్రకటన విడుదల చేశారు.

News February 16, 2025

నిడమర్రులో యువకుడి దారుణ హత్య

image

ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మాది ఏసురాజు (26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే యువకుడి చేయి నరికేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి నిడమర్రు SI చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

error: Content is protected !!