News July 11, 2024

ఏలూరు: రోడ్డు ప్రమాదం.. SEB-SPO దుర్మరణం

image

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గాలంకి శ్యామ్ యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శ్యామ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)లో పని చేస్తున్నాడు. ఆయన ఏలూరు నుంచి విజయవాడకు బైక్‌పై వెళ్తుండగా.. కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 20, 2025

భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

image

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News October 20, 2025

నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

image

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

News October 20, 2025

భీమవరం: నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ కోరారు.