News March 10, 2025
ఏలూరు: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్?

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన వంశీ(25) విజయవాడలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఓ యువతి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి గిరిపురంలో రూము తీసుకుని ఉంటున్నారు. ఇటీవల ఆ యువతి రూము నుంచి వెళ్లిపోయింది. బాధతో వంశీ ఈనెల 6వ తేదీ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు.
Similar News
News February 25, 2026
27, 28 తేదీల్లో దానం, కడియంల విచారణ

TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. వారు BRS గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి ఇప్పటికే స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News February 25, 2026
వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకు శ్రీశైలం జలాశయమే దిక్కుగా మారింది. గత 114 రోజుల్లోనే సాగర్ నుంచి 135 టీఎంసీల నీటిని వినియోగించగా, ప్రస్తుతం యాసంగి పంటలు చేతికి రావాలంటే మరో 81 టీఎంసీల నీరు అవసరం. శ్రీశైలం నుంచి కనీసం 45 టీఎంసీల నీరు వస్తేనే వేసవి గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 539 అడుగులకు చేరుకుంది.
News February 25, 2026
HNK: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదలుకానున్నాయి. జిల్లాలో మొత్తం 18,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అల్పాహారం తీసుకుని, గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్, పెన్నులతో పాటు సామగ్రిని జాగ్రత్తగా ఉంచుకోవాలని, సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.


