News February 9, 2025
ఏలూరు వాసులలో విషాదం నింపే వార్త

HYDలో ప్రముఖ పారిశ్రామిక వేత్త జనార్ధన రావు మనుమడి చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల జిల్లా వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం జిల్లాలో ప్రభుత్వాసుపత్రికి దశలవారీగా రూ.40 కోట్లు అందజేసిన దాత మృతి వార్త విషాదం నింపిందన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు కష్టమన్న వారికి సాయం అందించే జనార్ధన్ రావు వీసీగా జిల్లా వాసులకు సుపరిచితులు అని తెలిపారు.
Similar News
News February 15, 2026
శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు?

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.
News February 15, 2026
కాకినాడ: జేఎన్టీయూ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని సూసైడ్

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
News February 15, 2026
నెల్లూరు: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

నెల్లూరు జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు రైలు కిందపడి మృతి చెందారు. రాపూరు- వెల్లికల్లు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా నెల్లూరు- వేదాయపాళెం రైల్వే స్టేషన్ మధ్య ఒకరు, నెల్లూరు విజయమహల్ గేట్ వద్ద మరో వ్యక్తి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


