News March 20, 2025

ఏలూరు: విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి 

image

ఏలూరు జిల్లాలో గడిచిన 30 రోజుల్లో 57,481 ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్లలోపు, 15-17 ఏళ్లు ఉన్న విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆధార్ అప్డేట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకులు దూరమవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఉన్నారు.

Similar News

News March 31, 2025

సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని రేషన్ షాపులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

News March 31, 2025

భూకంపం.. మసీదులు కూలి 700 మంది మృతి

image

గత శుక్రవారం మయన్మార్‌లో వచ్చిన భూకంపానికి మసీదులు కూలి ప్రార్థనలు చేస్తున్న 700 మందికి పైగా మరణించారని ఓ ముస్లిం సంఘ ప్రతినిధులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సుమారు 60 మసీదులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత మసీదు భవనాలపై ఎక్కువ ప్రభావం పడిందని వివరించారు. కాగా, ఆ దేశంలో మొత్తం భూకంపం మృతుల సంఖ్య 1700 దాటింది.

News March 31, 2025

తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

image

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!